Agnipoolu - 1981 Telugu Film

గోవిందవల్లభరాజా, కులం మరియు  హోదా పట్టింపులున్న, రాచరికపు దర్పం  ప్రదర్శించే  జమీందారు.  అతడి  కూతురు రాజేశ్వరి (జయంతి)  అల్లుడు విరూపాక్షి రాజా (కృష్ణంరాజు )  జమీందారు భవంతిలో   జమిందార్ వద్దనే ఉంటారు. విరూపాక్షరాజా మావగారి   జాగీరును పాలిస్తూ పనివారిని చిన్న తప్పుచేసినా కొరడాతో కొడుతూ జంతువులలా చూస్తుంటాడు. 

 జమీందారు,  కొడుకు శివప్రసాద్ ( శ్రీధర్ ) అమెరికాలో మేరీ అనే యువతిని పెండ్లి చేసుకుని, పది సంవత్సరాలు అక్కడే ఉండిపోతాడు   పిల్లల( కొడుకు కూతురు )  తో  ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని  కొడుకుతో తనకెలాంటి సంబంధమూ లేదని ప్రకటిస్తాడు.   కూతురు రాజేశ్వరి ఆస్తినంతా కాజేయాలని  గోవిందవల్లభరాజా ని రెచ్చగొడుతుంది .  ఇంటికి వచ్చిన శివప్రసాద్‌ను, మేరీని అవుట్‌హౌస్‌లో ఉంచి అవమానం చేస్తారు. గోవిందవల్లభరాజా మృతదేహాన్ని కూడా చూడడానికి వారిని  అనుమతించరు.  గోవిందా వల్లభ రాజా చనిపోతాడు.  అతడి భార్య అన్నపూర్ణ విధవరాలు అవుతుంది.  ఇంతవరకూ కథ నేరుగా నడుస్తుంది. 


తదుపరి దృశ్యంలో   రాజేశ్వరి భర్త విరూపాక్షి రాజా మరణించినట్టు  అతడికి  అచ్చం తండ్రి రూపు కలిగిన  కృష్ణచైతన్య ( కృష్ణం రాజు )  అనే కొడుకు ఉన్నట్టు  అతడి భార్య  విధవరాలు అయినట్టు చూపిస్తాడు.  

కృష్ణచైతన్య జమీందారీకి అధిపతి అవుతాడు.  రుక్మిణి ఒక  మంచి నర్తకి.  కృష్ణచైతన్య రుక్మిణి        (జయప్రద) నాట్యం చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. నాట్యం ముగియగానే వివాహం అయిపోతుంది.   తరువాత   వారి వివాహ జీవితంఏమీ చూపకుండా  కృష్ణ చైతన్య  స్వభావంలో తండ్రికి పూర్తి గా విరుద్ధం గా సాధుస్వభావం దయ ఓర్పు కలిగి ఉన్నాడని చూపిస్తూ ఉంటాడు దర్శకుడు.  పనివారిని ప్రేమగా చూడడం , అమ్మ అమ్మమ్మ  మధ్య గొడవలు వచ్చి నప్పుడు వారికి సముదాయించడం వంటి రెండు దృశ్యాలు చూపి తదుపరి దృశ్యంలో జయప్రదని   చక్రాల కుర్చీ లో చూపిస్తాడు.   జయప్రద భర్తని సుఖపెట్టలేకపోయినా ఆమెను ప్రేమగా చూసుకుంటున్నట్టు చూపిస్తాడు. అందుకు జయప్రద ఏడుస్తూ  తన పెళ్లి ఆల్బమ్ చూసుకుంటున్నట్టు అక్కడ నుండి ఆమె ఎలా  కాళ్ళు పోగొట్టుకుందో చిన్న ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపిస్తాడు. ఆమె నాట్య ప్రదర్శనలు ఇవ్వడం జమిందారీ కుటుంబానికి అప్రతిష్ట అని   ఆమె అత్తగారు కృష్త  చైతన్య తల్లి ఆంక్ష విదిస్తుంది.  ముందుగా ఒప్పుకున్న ఒక్క చివరి ప్రదర్శన కి అనుమతి కోరి రుక్మిణి   నృత్యం చేసి అలసి  భర్త కృష్ణ చైతన్య తో  కారులో తిరిగి వస్తూ  కారు ప్రమాదానికి గురై అవిటిదవుతుంది. 

 అన్నపూర్ణ  అభ్యర్థనపై కొడుకు పిల్లలు తాతగారి   భవంతికి వస్తారు. అప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న  శివ ప్రసాద్  ( శ్రీధర్ ) పిల్లలు  జానీ బాబీ  పెద్దవాళ్లవుతారు   వాళ్ళే సుధాకర్ , జయసుధ.   జయసుధ ఎప్పుడూ తన తల్లి మేరీ డైరీ చదువు తుంటుంది . ఆమె తల్లి డైరీలో తనని భర్తని విరూపాక్షిరాజా ఎలాచంపాడోరాసినది చదువడం ఫ్లాష్ బ్యాక్ లా చూపిస్తాడు.  తన తల్లిదండ్రుల దారుణమరణానికి కారణమైన విరూపాక్షిరాజా కుటుంబంపై ముఖ్యంగా కృష్ణచైతన్య మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది జానీ ( జయసుధ) . 

శాంతస్వభావుడైన కృష్ణచైతన్యకు జానీ చేష్టలు అర్థం కావు. జానీ దాచుకున్న మేరీ డైరీ కృష్ణచైతన్యకు దొరుకుతుంది. అది  కృష్ణచైతన్య మేరీ , ఆమె భర్త శ్రీధర్ సమాధులవద్ద చదువుతుండగా  జయసుధ తుపాకీతో అతడి ఎదుట నిలుస్తుంది.  జయప్రద చక్రాల కుర్చీ లో    ఆ కొండ ప్రాంతానికి చేరుకొని  జయసుధని నిరోధించడాని కొండమీద నుంచి పడి ఆత్మా హత్య చేసుకుంటుంది. హాస్పత్రిలో ప్రాణాలు విడుస్తూ జయసుధని కృష్ణ చైతన్యని కలుపుతుంది.    హీరోయిన్ ని సినిమా అంతా  చక్రాలకుర్చీ కి పరిమితం చేయడం క్లైమాక్ లో చంపేయడం  ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. కథ  బాగున్నా   స్క్రీన్ ప్లే  దొబ్బేయడంతో సినిమా  ఎత్తేసింది.

Comments

Popular posts from this blog

My French student got French job in Kuwait

French Classes in Vijayawada